చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజునే ఆంజనేయ స్వామి జన్మించాడని భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది ఏప్రిలో 16వ తేదీ శనివారం రోజున హనుమాన్ జయంతి వస్తోంది. అయితే ఈ రోజున వాయు పుత్రుడిని పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అంతే కాదు దంతుల మధ్య ఎడబాటు ఉన్న వారు స్వామి వారిని పూజించడం వల్ల ఒక్కటవుతారనేది భక్తుల విశ్వాసం. అయితే ఈ సారి హనుమాన్ జయంతి శనివారం రోజున వస్తుండటంతో మరింత ప్రాముఖ్యత పెరిగింది.
వేకువ జామునే లేచి తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకోవాలి. స్వామి వారి ముందు దీపం వెలిగించి 11 సార్లు హనుమాన్ చాలీసా పటించాలి. ఇలా చేయడం వల్ల ఆంజనే. స్వామి ప్రసన్నుడవుతాడట. అంతే కాకుండా శని దోషం కూడా తొలగిపోతుందట. 11 రావి ఆకులు తీసుకొని దానిపై శ్రీరామ అని రాసి హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.