చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుడి పుట్టిన రోజు. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ రోజే మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. అయితే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. మీరు కోరుకున్న 5 కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి మనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమాన్ గురించి.. హనుమాన్ జయంతి నాడు పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వారనం. రెండోది గరుడు. మూడోది వరాహం, నాలుగోది నరసింహ, ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం. అయితే ఈ ఐదు దేవుళ్లకు ఈరోజు ఇష్టమైన ప్రసాదాలు చేసిపెట్టి… ఆంజనేయుడికి పూజ చేయించాలి. శ్రీరామ నామం, హనుమాన్ చాలీసా వంటివి పఠఇంచాలి. దీపం వెలిగించడం, సింధూరం పెట్టించడం వంటివి చేయడం వల్ల ఆ వాయు పుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి.
హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే.. ముఖ్యంగా ఈ ఐదు కోరికలు నెరవేరుతాయంట. ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారట. జీవితంలో కష్టాలు తొలగిపోతాయట. కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు. భయం, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుండి స్వేచ్ఛ లభిస్తుంది. కోరిన కోరిక నెరవేరుతుంది.