...

Coaching for two rupees: రూ.2కే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్.. ఎక్కడో తెలుసా?

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులకు అక్కడి ఓ సంస్థ అరుదైన ఆఫర్ ప్రకటింటింది. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రూ.2 కే రివిజన్ తరగతులను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఆపీసర్స్ అకాడమీ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ సౌరభ్ శర్మ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టిట్యూట్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని లేదా వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకొని తరగతులు రెండు రూపాయలకే వినొచ్చని చెప్పారు.

Advertisement

ఇప్పటి వరకు మొత్తం నాలుగు వేల మంది పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపారు, ఇది కాకుండా ఆర్థికంగా వెనుక బడిన వర్గాల కోసం వైభవ్ 30 పేరుతో ఓ కోర్సును ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఆ విద్యార్థులు ఇన్ స్టిట్యూట్ నిర్దేశించిన ఓ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే కోచింగ్ కు ఎక్కువ డబ్బు పెట్టలేని వాళ్లు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయితే చాలు వాళ్లు.. రెండు రూపాయలకే కోచింగ్ ఇస్తారు.

Advertisement
Advertisement