...

Sri Rama Navami: శ్రీ రామ నవమి రోజు ఈ పద్ధతిలో పూజ చేయటం వల్ల సకల సుఖాలు మీ సొంతమవుతాయి..!

Sri Rama Navami: తెలుగు ప్రజలకు పెద్ద పండగ ఉగాది పర్వదినం అనంతరం చైత్ర శుక్ల నవమి నాడు శ్రీరామనవమి పండుగను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఈ పండుగను చైత్ర శుక్ల నవమి రోజు జరుపుకోవడానికి కారణం కూడా ఉంది. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని, అదే రోజున సీతమ్మవారి తో శ్రీరామునికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పర్వదినాన ప్రజలు శ్రీ రామ నవమి పండుగ రోజు సీతారాముల కళ్యాణం జరిపించి ఎంతో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.

శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి నిష్టగా పూజ చేయటం వల్ల కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు వస్తాయి. పండుగ రోజున శుభ ఘడియల్లో శ్రీ రామ స్తోత్రాలు చదువుతూ పూజ చేయటం వల్ల ఆ ఆ శ్రీరాముడి కృప మనమీద ఉంటుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు కష్టాలు ఉండే వారు శ్రీరామనవమి రోజున రామ రక్ష స్తోత్రం చదువుతూ నిష్టగా పూజ చేయటం వల్ల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లువెత్తుతాయి.

శ్రీరాముడికి ప్రియ భక్తుడైన హనుమంతుడిని శ్రీ రామనవమి రోజున పూజిస్తే ఆ హనుమంతుడి కృపవల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి. శ్రీ రామ నవమి పండుగ రోజున శ్రీరాముని స్తోత్రాన్ని పటిస్తూ.. రామాయణం చదువుతూ.. నియమనిష్ఠలతో శ్రీరాముడికి పూజ చేయటం వల్ల ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారు.