Viral Video: సోషల్ మీడియాలో రోజుకు వేల కొద్దీ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా, ఆశ్చర్యం కలిగించేవి ఎక్కువ ట్రెండ్ లో నిలుస్తూ పాపులర్ అవుతాయి. దాంతో ఆ వీడియోలో వ్యక్తులు ఒక్క రోజు లేదా రాత్రిలోనే ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకుంటారు. అలా కొన్ని వీడియోలు, రీల్స్ చేసి స్పాట్ లో పాపులారిటీని తెచ్చుకోవడం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం. అలా వారు అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ఇమేజ్ ను తెచ్చుకుంటారు.
కాగా ఇలాంటి తరహాలో కాకపోయినా, కాస్త నవ్వును తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది ఒక పెళ్లికి సంబంధించిన వీడియో అని చూస్తేనే అర్ధం అవుతుంది. కాగా ఇందులో పెళ్లి కొడుకుకు కరెన్సీ నోట్లతో కూడిన ఒక దండను వేస్తారు. దాంతో పక్కనే ఉన్న స్నేహితుడికి ఆ మాల మీద కన్నేసి, ఎప్పుడు ఆ నోట్లను దొచుకుందామా అన్నట్టు చూస్తుంటాడు. తన మీద అనుమానం పెళ్లి కొడుక్కి అనుమానం వచ్చిందని తెలిసి కాసేపు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
అలా కాసేపటి తరువాత మళ్ళీ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆ స్నేహితుడు. ఆ దండను గుచ్చిన కరెన్సీ నోట్ల నుంచి ఒక్కో నోటును తీసుకొని జేబులో పెట్టుకోవడం అందరకీ ఆశ్చర్యంతో పాటు, నవ్వునూ తెప్పిస్తోంది. ఇలాంటి వీడియోలు రోజుకు కుప్పలు కుప్పలుగా వస్తున్నా కొన్ని వీడియోలు మాత్రం ఇలా వైరల్ అవుతుంటాయి. అలాగే ఈ వీడియో కూడా ఇన్స్ స్థాగ్రామ్ అప్లోడ్ చేయగా, యూజర్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ, నవ్వులు చిందిస్తున్నారు.