Ganesh pooja : అందరు దేవుళ్లలోకెల్లా గణేష్ ముఖ్యుడు, ఆద్యుడు. ఏ దేవునికి పూజా చేయాలన్న మొదట గణపతిని ఆరాధించాలి. మనసారా కోలిస్తే కోరిన కోర్కేలు తీరుస్తాడు గణనాథుడు. విశిష్టమైన ఆధ్యాత్మిక వస్తువుల్లో శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు ఒకటి. దీన్ని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు.
అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం(తెల్ల జిల్లేడు) గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు వాటి వల్ల కలిగే అనవసర భయలా పోతాయి. ఆర్థిక కష్టాలు, శత్రు బాధలు, రుణ బాధలు వెంటనే పోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు నశిస్తాయి.
శ్వేతార్క గణేశుడిని పూజింటే వారికి జ్ఞానం, సంపద, సుఖశాంతులు లభిస్తాయి. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివసిస్తాడని పండితులు అంటారు. తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఇంట్లో ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట.
తెల్లజిల్లేడు.. శ్వేతార్క గణపతిని పూజిస్తే విశిష్టమైనది…
ఇంకా ఆ ఇంట ఉండే వారి ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం కలిగించకుండా, వారి ప్రయోగాలు పూర్తిగా నశిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని విశ్వసిస్తారు. జాతక చక్రంలో సూర్య గ్రహ దోషాలు ఉన్న వ ారు, జాతక చక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్న వారు ఇంటికి నర దృష్టి ఉన్న వారు, వీధి పోటు కలిగిన వారు, వాస్తు దోషాలతో సతమతమయ్యే వారు సర్వ కార్య సిద్ధి కోసం శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి.
శ్వేతార్క గణేషుడిని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పురోహితులను సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టుకుని.. ఇంట శ్వేతార్క గణేషుడిని ప్రతిష్టించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఆలయాల్లో శ్వేతార్క గణపతి ప్రతిమను కొనుక్కుని తెచ్చుకున్నట్లైతే పూజ గదిలో ఉంచి రోజూ నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి బుధవారం ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి శ్వేతార్క గణపతిని శుభ్రంగా కడిగి పూజ గదిలో ఎర్రని వస్త్రంపై ధూప దీప నైవేద్యాలతో పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Read Also : Lord Ganesha : పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలో తెలుసా?