GasLeak Safety Tips: ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలోను మనకు వంట కోసం గ్యాస్ సిలిండర్లను విరివిగా ఉపయోగిస్తున్నాము. అయితే వంట కోసం గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న సమయంలో మనం ఎన్నో భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సిలిండర్ విషయంలో ఏమాత్రం అప్రమత్తమైన భారీ నష్టాలను ఎదుర్కోవాలి. ఇలా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కొన్ని సార్లు కొన్ని కారణాల వల్ల గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది.ఈ విధంగా గ్యాస్ లీక్ అయితే భయపడకుండా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్న సమయంలో ముందుగా చిన్నపిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించాలి. ఈక్రమంలోనే గ్యాస్ లీకేజ్ ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని గుర్తించిన అనంతరం ఆ గ్యాస్ వాసన పీల్చకుండా ముక్కు మూతికి మాస్క్ అడ్డు పెట్టుకోవాలి. ఈ క్రమంలోనే ముందుగా గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రెగ్యులేటర్ ఆఫ్ చేసిన మనకు గ్యాస్ లీక్ అవుతున్న వాసన వస్తున్నట్లు అయితే ముందుగా రెగ్యులేటర్ తొలగించి సిలిండర్ సేఫ్టీ క్యాప్ మూసి పెట్టాలి. ఇలా సేఫ్టీ క్యాప్ మూసి పెట్టిన అనంతరం వెంటనే గ్యాస్ ఏజెన్సీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించాలి.
గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో ఇంట్లో కిటికీలు తలుపులు తెరిచి పెట్టాలి. పొరపాటున కూడా ఎలక్ట్రిక్ వస్తువులకు దూరంగా ఉండాలి వాటిని తాకకూడదు. ఇకపోతే ఒకవేళ గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు కనుక ఏర్పడితే భయపడకుండా మందపాటి రగ్గును నీటిలో తడిపి వెంటనే సిలిండర్ పై వేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అదుపు చేయవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World