F3 Movie Release : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ” F3 “. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు.
ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్. ఈ మేరకు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.
మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉వస్తే, కొద్దిగా ముందుకి
వెళ్ళినా కొద్దిగా వెనక్కి😀Advertisementథియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/HsR7nYlsVP
— Anil Ravipudi (@AnilRavipudi) January 29, 2022
Advertisement
ఓ బస్సులో ఎఫ్3 టీమ్ అంత ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకి… మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది, వస్తే కొద్దిగా ముందుకి… వెళ్ళినా కొద్దిగా వెనక్కి థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. కరోనా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి తీసుకురాలేదు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!