Rashmi – Sudheer: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై ఈ జంట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ కి, రష్మి కి సోషల్ మీడియాలో భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ జంట రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ ఒక్కటైతే చూడాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సుధీర్ రష్మి గౌతమ్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఈ జంట ను బుల్లితెరపై ఎన్నిసార్లు చూసినా కూడా మళ్లీ మళ్లీ చూడాలి అని పిస్తూ ఉంటుంది.
ఇలా ఈ జంట గత కొన్ని ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇక ఒకానొక సమయంలో అయితే ఈ జంట నిజంగానే ప్రేమలో పడ్డారా? అనే విధంగా జీవించే చేశారు. ఇప్పటికే ఈ జంటపై మల్లెమాల వారు ఎన్నో ఈవెంట్లను చేసిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ లు అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే రష్మీ సుధీర్ లు పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇదే ప్రశ్న రష్మీ సుధీర్ లకు పలుసార్లు అభిమానుల నుంచి ఎదురయ్యింది. కానీ ఆ విషయం పై సుధీర్ రష్మీ లు పలుసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ, అభిమానులు మాత్రం పదే పదే మరీ అడుగుతుంటారు.
అయితే తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని, తెరపై మాత్రమే అలా ఉంటామని తెరవెనుక ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్లిపోతాం అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంతే తప్ప అంతకు మించి వారి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా లేదని చెబుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ షోలో రష్మీ, సుధీర్ లు కనిపించారు. స్టార్ మాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయగా ఆ ఈవెంట్ కు పాల్గొన్న రష్మి సుధీర్, కొన్ని పర్సనల్ విషయాలను బయటపెట్టారు. సుధీర్ తన ఫోన్లో రష్మి నెంబర్ ను ఏవిధంగా సేవ్ చేసుకున్నాడో చెప్పేశాడు. మామూలుగా రష్మీ నెంబర్ ను రష్మీ అని సేవ్ చేసుకున్నాడట. కానీ మధ్యలో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో బిజీగా ఉండడంతో ఓపెనింగ్స్ అని సేవ్ చేసుకున్నాడట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రష్మి అనే సేవ్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు సుధీర్.
Tufan9 Telugu News And Updates Breaking News All over World