...

John Abraham: డబ్బు కోసం తెలుగులో నటించను… నేను హిందీ హీరోను మాత్రమే… జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!

John Abraham: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గురించి మనందరికీ తెలిసిందే. జాన్ అబ్రహం ప్రస్తుతం ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇందులో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండెజ్, అలాగే ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ లతో బిజీ బిజీగా

ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పటికీ తెలుగు సినిమాల్లో నటించను అని ఎందుకంటే తనకు ప్రాంతీయ భేదం ఉంది అని తెలిపారు. ఈ సందర్భంగా జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సదర్ హోస్ట్ మీరు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నారు అంట కదా నిజమేనా అని ప్రశ్నించగా..

ఆ విషయంపై స్పందించిన జాన్ అబ్రహం నేను ఎటువంటి తెలుగు సినిమాల్లో నటించడం లేదు. నాకు ప్రాంతీయ భేదం ఎక్కువ.. ప్రాంతీయ సినిమాలలో నేను ఎక్కువ గా నటించను. ఇతర హీరోలు మాదిరిగా డబ్బుల కోసం తెలుగు సినిమాలలో నటించాను. ఎన్నడూ ఇతర భాషల్లో సహా నటుడిగా సెకండ్ హీరోగా చేయను.. నేను హిందీ హీరో ని హిందీలో మాత్రమే సినిమాలు చేస్తాను. ప్రాంతీయ సినిమాలో నేను కనిపించేది లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు జాన్ అబ్రహం. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.