...

Janaki Kalaganaledu: జ్ఞానాంబని రెచ్చగొడుతున్న మల్లిక.. గోవిందరాజు ఏం చేయనున్నాడు..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో రామచంద్ర, జానకి లు పడుకొని ఉండగా నిద్రలో జానకి రామచంద్ర గుండెలపై చేయి వేస్తుంది. దానితో రామచంద్ర ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. అలా కొద్దిసేపు జానకిని అలాగే రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు రామచంద్ర. ఈరోజు ఉదయం జానకి పొయ్యి మీద వంట చేస్తుండగా అది చూసిన శ్రావణి ఈ పొయ్యి ఏంటి? ఈ ఇళ్ళు ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది.

అప్పుడు జానకి మాట్లాడుతూ మా ఆడపడుచు పెళ్లి విషయంలో ఒక చిన్న అపార్థం ఎదురయ్యింది దాని వల్లే ఇలా ఉంటున్నాను అని చెబుతుంది జానకి. అప్పుడు శ్రావణి మీ అత్తయ్య గారు ఎంత మూర్ఖురాలో నాకు తెలుసు అని అంటుంది. ఇలాంటి కష్టాలు పడటం కంటే రామచంద్ర కు విడాకులు ఇచ్చి అని అనడంతో అప్పుడు జానకి షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది.

కుటుంబం అన్న తర్వాత ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయా! ఎందుకు ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావు అని అనడంతో శ్రావణి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యోగి ఫోన్ చేసి జానకి పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్పడంతో వెంటనే యోగి నేను ఈరోజే బయలుదేరి ఇండియా కు వస్తున్నాను అని చెబుతాడు.

ఇక మరొకవైపు జానకి ఖార్జానా లో పనిచేస్తున్న రామచంద్రకు భోజనం తీసుకొని వెళుతుండగా అది చూసిన నీలావతి ఇటు రా జానకి అని పిలుస్తుంది. జానకిని, నీలావతి, జ్ఞానాంబ స్వీట్ షాపు ఎదురుగానే నానారకాలుగా మాటలు అంటూ అవమానిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వారు రేపు ఆస్తిలో కూడా వాటా అడుగుతారు అని అనడంతో జ్ఞానాంబ చాలా బాధపడుతుంది.

ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటికి వెళ్లడంతో మల్లిక దొంగ ఏడుపులు ఏడుస్తూ జానకి పై లేనిపోని మాటలు అన్ని చెప్పి జ్ఞానాంబ ను రెచ్చగొడుతుంది. బావ గారికి జానకి విడాకులు ఇచ్చేస్తుందట అత్తయ్య గారు అని చెప్పడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గోవిందరాజు వచ్చి మల్లికను తిడతాడు. కానీ మల్లిక మాత్రం ధైర్యంగా కావాలంటే జానకి ని అడగండి అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.