Suma Kanakala: బుల్లితెర స్టార్ మహిళగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండే సుమా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది.ఇక ఈమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఈమె ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మే ఆరవ తేదీ విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో నటించినందుకు సుమ భారీగానే నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో సుమ సుమారు 85 లక్షల పాటు రెమ్యునరేషన్ తీసుకుని అనంతరం తనకు సినిమా లాభాలలో వాటా కావాలనీ అడిగారట.అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా సందడి చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటుందనీ, సుమ తోపాటు మేకర్స్ కూడా భావించారు. అందుకే సుమ ఈ సినిమాకి పారితోషికం కాకుండా సినిమా లాభాలలో వాటాలు తీసుకోవాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇలా ఈ సినిమా లాభాలలో తనకు నాలుగు నుంచి ఆరు కోట్ల వరకు లాభం వస్తుందని భావించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే సుమ భారీ మొత్తంలో నష్టపోయిందని చెప్పాలి. కేవలం కొంత డబ్బు మాత్రమే పారితోషకంగా తీసుకున్న సుమ ఆ డబ్బుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాకి లాభాలు రావటం ఏమో కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ సంపాదించుకోవడంతో సుమ కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా జరగడం సుమకు ఒక గుణపాఠంగా మారిందని చెప్పాలి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World