...

Nagadosham : నాగదోషం ఉంటే ఈ సంకేతాలు నిజంగానే కనిపిస్తాయా.. నిజమెంత?

Nagadosham : మనకు నాగ దోషం ఉంటే ముఖ్యంగా సంతాన సమస్యలు ఎక్కువగా కల్గుతాయనేది ప్రజలందరి నమ్మకం. అలాగే నాగ దోషం మనపై ఉంటే తరచుగా గర్భ స్రావం అవుతుందని కూడా అంటుంటారు. మనం ఇందులో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిని వైద్య పరంగా ఎన్న రకాలుగా ప్రయత్నించినా సంతాన అభివృద్ధి చెందకపోవడం నాగ దోషం ఉందని వివరిస్తుంటారు. మరి అసలు నాగ దోషం అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు కానీ, వాళ్లు పూర్వీకులుకానీ నాగు పామును చంపినా లేదా రెండు పాములు కలిసి ఉన్న సమయంలో చూసినా నాగదోషం మనపై పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

Nagadosham
Nagadosham

అయితే ఈ దోషాన్ని తొలగించుకునేందుకు అలాంటి పనులు చేయాలని వేద పండితులు చెబుతున్నారు. ముుఖ్యంగా నాగ పామును చంపినప్పుడు… దానికి తప్పనిసరిగా దహన సంస్కారాలు నిర్వహించి బూడిద చేయాలి. దహనం చేసేటప్పుడు అందులో ఒక రాగి నాణెం వేసి తగలబెట్టాలి. అలా చేయకపోతే మనకు తరతరాలుగా నాగ దోషం ఉంటుంది. దీని వల్ల సంతాన సమస్యలు ఎదుర్ోవాల్సి వస్తుంది. అలాగే పరిహారం చేసుకోవాలంటే ఎక్కువగా రామేశ్వరం వెళ్లి అక్కడ నాగుపాము ప్రతిమను ప్రతిష్ట చేస్తే మీకు తప్పుకుండా సంతానం కల్గుతుందని తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని స్థలాల్లో జం నాగులు చెక్కబడి ఉంటాయి. వాటికి మనం పూజ చేయాలి. లేదా పుట్టలో పాలు పోస్తే ఈ దోషం తగ్గిపోతుంది.

అలాగే ప్రతి శుద్ధ చవితికి పుట్టలో పాలు పోస్తూ నియమాలు పాటిస్తే స్త్రీకి గర్భ ధారణకు అడ్డుపడే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నియమాలు ఏంటంటే వాడిన పదార్థాలు తినకపోవడం, చలిమిడి, చీమ్మిలి అనే పదార్థాలను నాగుల చవితి రోజు మైవేద్యంగా పెట్టి వాటిని తినాలని పూర్వీకుల నుంచి చెబుతున్నారు. అయితే ఇవి తినడం వల్ల మనకు చలవ చేయడమే కాకుండా కర్భ దారణకు సంబంధించి ఈ రెండు ఆహారాలు తింటే మనకు సంతానం కల్గుతుందని చెబుతూ ఉంటారు.

Read Also : Saturday special : శనివారం రోజు ఈ వస్తువులను అస్సలే కొనొద్దట.. ఎందుకో తెలుసా?