Vastu Tips: సాధారణంగా మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా హ్యాండ్ బ్యాగ్ లేదా పర్స్ తీసుకొని వెళ్తాము. అయితే చాలా మంది కొన్ని రకాల వస్తువులను సెంటిమెంట్ గా పర్సులో పెట్టుకోవడం చేస్తుంటారు. ఇలా కొన్ని రకాల వస్తువులను పర్స్ లో పెట్టుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అలాగే మరికొన్ని వాటిని పర్స్ లో పెట్టకపోవడమే ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.మరి పర్సులో ఎలాంటి వస్తువులను పెట్టుకోవచ్చు వేటిని పెట్టుకోకూడదనే విషయానికి వస్తే…..
సాధారణంగా మనం ఏదైనా షాపింగ్ చేస్తే వెంటనే ఆ బిల్ పేపర్ ను పర్స్ లో పెట్టుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఇలా బిల్ పేపర్ ఎక్కువ రోజులపాటు పర్స్ లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది. అదేవిధంగా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను కూడా పొరపాటున కూడా పర్సులో ఉంచుకోకూడదు. ఇలా చనిపోయిన వ్యక్తి ఫోటో మన పర్స్ లో ఉండటం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఫోటోలను పర్సులో పెట్టుకోకూడదు అలాగే చాలా మంది బండి,కారు కీస్ పర్స్ లో పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం కూడా మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం మన హ్యాండ్ బ్యాగ్ లేదా పర్సులో పిడికెడు బియ్యం వేసుకోవటం ఎంతో మంచిది.ఇలా బియ్యం పర్సులో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా పర్సులో లక్ష్మీదేవి ఫోటో అలాగే ఒక రావి ఆకు ఉంచుకోవడం ఎంతో మంచిది. ఇక చాలామంది పర్సులో డబ్బులను చిందరవందరగా పెట్టుకుంటారు. నిజానికి డబ్బులను అలా పెట్టుకోకూడదు.పెద్ద నోట్ల నుంచి చిన్న నోట్ల వరకు సక్రమంగా పర్సులో డబ్బు పెట్టుకోవాలి.ఇలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Read Also : Devotional Tips: శని ప్రభావం మన ఇంటి పై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!