Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఇదో ప్రత్యేకమైన రోజు.. ప్రతి ఏడాది దీపావళికి ముందు ఇది వస్తుంది. దీన్ని ధన్‌రాస్ లేదా ధన త్రయోదశిగా పిలుస్తారు. లేదా చోటీ దివాళీగా చెబుతుంటారు. ప్రతి ఏడాదిలానే 2021 ఏడాదిలో కూడా ఈ ధన త్రయోదశి రానుంది. పురాణాల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన రోజున ఏమైనా వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. అలాగే ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా చేస్తే లేని దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్టే..
ఈ ఏడాది నవంబర్ 2న ధన త్రయోదశి.. ఈ రోజును మహిళలు ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. చాలామంది మహిళలు బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. వెండి వస్తువులు కూడా కొంటుంటారు. ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే శుభప్రదమని విశ్వసిస్తుంటారు. ఏయే వస్తువులు కొంటే మంచిది… ఏయే వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది కాదో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ధంతేరస్ ప్రత్యేకమైన రోజున.. లోహాపు వస్తువులను కొనరాదు.. అంటే.. ఇనుముతో తయారుచేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకురావొద్దు.. అలా చేస్తే దరిద్రం వచ్చి చేరుతుంది. రాహువు లేదా శని ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంట్లో ఏదో చికాకులు, గొడవలు కలిగే ప్రమాదం ఉంది. ధంతేరస్ రోజున మీ ఇంట్లోకి నల్లటి వస్తువులను అసలే తీసుకురాకూడదు. అలా చేస్తే.. అశుభానికి సంకేతం.. నలుపు అనేది దురదృష్టానికి సంకేతంగా చెబుతారు. నల్లటి వస్తువులను ఇంట్లోకి తీసుకురాకపోవడమే మంచిది. ధను త్రయోదశి రోజున.. గాజుతో తయారైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావొద్దు.. ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయరాదు. గాజు లేదా లోహం అంటే రాహువుకు సంకేతంగా చెబుతారు.
ఇలాంటి ప్రత్యేకమైన రోజున గాజు వస్తువులను కొనరాదు. లేదంటే చెడు ప్రభావానికి గురికాక తప్పదు. ధంతేరస్ లేదా ధన త్రయోదశి రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలను కొనుగోలు చేయరాదు.. స్టీల్ తో తయారైన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తించుకోవాలి. అలా చేసిన వారికి రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారని నమ్ముతారు. ఇక ఇతర లోహాపు వస్తువులను కూడా కొనరాదు.. ఇనుప వస్తులైన కత్తులు, కత్తెర లాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. ధన త్రయోదశి రోజున ఈ తరహా వస్తువులను కొనకూడదు.
Garuda Puranam : ఇలాంటి అలవాట్లను వదిలేయండి.. మీ ఇంట్లో సమస్యలకు సంకేతాలివే!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world