Karthika Deepam : మద్యం తాగి చిందులేస్తున్న వంటలక్క.. షాక్‌లో మోనిత..?

Karthika Deepam March 9th Today Episode :
Karthika Deepam March 9th Today Episode

Karthika Deepam March 9th Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..సౌందర్య గుడిలో పూజారి చెప్పిన మాటలను తలచుకొని పదేపదే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు ఇంత ఓదార్చిన కూడా సౌందర్య బాధపడుతూనే ఉంటుంది. మరొకవైపు దీప, కార్తీక్ లు కూర్చొని మందు తాగుతూ ఉంటారు.

దీప ఇంకొక్క పెగ్గు పోయి అంటూ కార్తీక్ తో మందు పోయించుకుని మరి తాగుతూ ఉంటుంది. నీకు బాగా మందు ఎక్కువగా ఉంది అని కార్తీక్ అనగా, ఊరికే మందు ఎక్కువ అయిందని అరవకురా అని అంటుంది దీప. మరొకవైపు మోనిత,కార్తీక్, దీప లు చిక్ మంగళూరు వెళ్లారు అని తెలుసుకుని షాక్ అవుతుంది.

Advertisement
Karthika Deepam March 9th Today Episode
Karthika Deepam March 9th Today Episode

అంతేకాకుండా నేను ఇక్కడ ఉంటే నువ్వు కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తావా కార్తీక్ అని ఉంటుంది మోనిత. మరొకవైపు దీప, ప్యాంటు ధరించి మందు తాగి స్టెప్పులు వేస్తూ ఉంటుంది. అది చూసిన హిమ,సౌర్య అమ్మా నువ్వు ఫ్యాంట్ వేసుకున్నావా అని ఆశ్చర్యపోతారు. ఇక హిమ సౌర్య లు ఒకరి పేర్లు ఒకరు పచ్చబొట్టు పొడిపించుకుంటారు. ఆ తర్వాత దీప మందు తాగి పాటకు స్టెప్పులు వేస్తూ ఉంటుంది. అది చూసిన పిల్లలు సంతోషంతో వాళ్లు కూడా జెంట్స్ చేస్తారు.

ఈ నేపథ్యంలోనే దీప, కార్తీక్ కు తెగ ముద్దులు పెట్టేస్తుంది. ఇక ఉదయాన్నే కార్తీక్ పడుకొని ఉన్న దీప ని చూసి జరిగిందంతా గుర్తు ఉంటుందా అనుకొని సంతోష పడుతూ ఉంటాడు. లేకపోతే మనిద్దరం కలిసి డ్యాన్స్ చేయడం ఏంటి? మందు కొట్టడం ఏంటి?అని కార్తీక్ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తరువాత దీప నిద్ర లేపుతాడు. అలా కొద్దిసేపు దీప, కార్తీక్ లు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam March 8th Today Episode : ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ బాబు వంటలక్క.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?

Advertisement