Telugu NewsLatestGuppedantha Manasu : రిషిఫై విరుచుకుపడ్డ మహేంద్ర.. దేవయానిఫై తిరగబడ్డ వసు..?

Guppedantha Manasu : రిషిఫై విరుచుకుపడ్డ మహేంద్ర.. దేవయానిఫై తిరగబడ్డ వసు..?

Guppedantha Manasu March 9th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రిషి, క్యాబిన్ నుంచి జగతి ఏడ్చుకుంటూ వెళ్లిపోవడంతో అది చూసిన మహేంద్ర రిషి పై విరుచుకు పడతాడు. జగతిని ఎందుకు బాధ పెట్టావు. నిన్ను కనడమే జగతి చేసిన తప్ప అని కోప్పడతాడు. అప్పుడు రిషి,డాడ్ నేను విచక్షణ విజ్ఞత లేకుండా మాట్లాడలేదు అని అనగా.. అప్పుడు మహేంద్ర అంత మర్యాదగా అవమానించావా మీ అమ్మను అని అంటాడు.

Advertisement

అప్పుడు రిషి నాకు అమ్మ అనే అదృష్టం లేదు అని చెప్పగా, ఇన్నాళ్లుగా నన్ను డాడ్ అని పిలవడం జగతిని మేడం అని పిలుస్తున్నావు కదా ఆ ఒక్క పదం చాలా ఆమె గుండె బద్దలవ్వడానికి అని అంటారు మహేంద్ర. మరొకవైపు వసుధార, జగతి కారులో వెళుతుండగా మధ్యలో దేవయాని కారుకి అడ్డుపడుతుంది.

Advertisement
Guppedantha Manasu March 9th Today Episode
Guppedantha Manasu March 9th Today Episode

జగతి కి జరిగిన అవమానాన్ని దెప్పి పొడుస్తూ ఆరోగ్యం బాగుందా అని వెటకారం గా మాట్లాడుతుంది. కోపంతో రగిలిపోయిన వసు తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ, దేవయానిపై విరుచుకుపడుతుంది. తల్లి కొడుకుల బంధాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేరు అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వెళుతుంది వసుధార. మరొకవైపు రిషి తండ్రి మహేంద్ర అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.

Advertisement

ఇక వసుధార, జగతికి తీసుకొని వస్తుంది.. ఆ తర్వాత కొద్ది సేపు వారిద్దరూ జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో జగతి ఇంటికి వచ్చిన రిషి మీ మేడమ్ కి ఒక పని అప్పజెప్పారు అది ఎంతవరకు వచ్చిందో అడుగు అని వసు తో అంటాడు. అప్పుడు నేను ఎందుకు అడగాలి సార్ అంటూ వసు కోప్పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Guppedantha Manasu March 8th Today Episode : దేవయానిఫై విరుచుకుపడ్డ వసుధార.. రిషి ఏం చేయనున్నాడు..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు