CPI Narayana: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే 20 మంది కంటెస్టెంట్లుతో నిన్ననే ఈ షో ప్రారంభం అయింది. వంద రోజులకు పైగా ఎంటర్ టైన్ మెంట్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా.. బిగ్ బాస్ కోసం ఎదురు చూసే జనం కోట్లలో ఉండగా.. ఈ షోని విమర్శించే వాళ్లు కూడా తక్కువేం కాదు. అయితే అలా షో ప్రారంభమైందో లేదో దాన్ని బ్యాన్ చేయాలంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా బిగ్ బాస్ షోపై ఫైర్ అయ్యారు సీపీజీ జాతీయ కార్యదర్శి నారాయణ. కాసులకు కక్కుర్తి పడే వాళ్లు ఉన్నంత కాలం ఇలాంటి షోలు ఉంటాయంటూ కామెంట్లు చేశారు. బిస్ బాస్ షోతో నిర్వాహకులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ప్రజలు గుర్తించాలని అన్నారు. బిగ్ బాస్ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా అంటూ… ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక అనైతిక షో అంటూ… వితం జంతువులు ఈ హౌస్ లో కి వచ్చాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ బిగ్ బాస్ షోపై నారాయణ తీవ్ర విమర్శలు చేశారు.