Chiranjeevi Tulasi : టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పేరును స్పెషల్ గా ఇంట్రడ్యూ్స్ చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఆయనదే ఫస్ట్ ప్లేస్. తన డ్యాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. మూవీస్ పరంగానే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లోనూ ఆయన ముందుంటారు. ఇంత స్థాయికి రావడానికి ఆయన అనేక కష్టాలు అనుభవించారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన ఎన్ని కష్టాలను చూశారో ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. ఈ విషయాలను ఆయన ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. ఆయన ఫ్యామిలీ, సన్నిహితులకు తెలుసు ఆయన పడిన కష్టాలు. అలాంటి విషయాన్ని ప్రస్తుతం బయటపెట్టింది నటి తులసి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. చిరు గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. కె వాసు డైరెక్షన్ కోతల రాయుడు మూవీలో నటించాడు చిరు. ఆ మూవీకి తమ్మారెడ్డి భరద్వాజ్, వాణి ప్రొడ్యూసర్స్? ఈ మూవీలో తులసి సైతం ఓ కీలక రోల్ లో యాక్ట్ చేసింది. ఆ మూవీ షూటింగ్ టైంలో అనుకున్న టైం కంటే ఆలస్యంగా వచ్చారంట చిరు. దీంతో ప్రొడ్యూసర్ కు కోపం వచ్చి చిరును ఎండలో నిలబడి చెప్పి వెళ్లిపోయారట. దీంతో చిరు ఎండలోనే నిల్చుని ఉన్నారని చెప్పుకొచ్చింది తులసి.
అనంతరం ఆయన షూటించి వచ్చారట. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా సదురు ప్రొడ్యూసర్ కు గౌరవం ఇచ్చేవారట చిరంజీవి. అవమానాలను గుర్తు పెట్టుకోని తత్వం చిరంజీవిది. అందుకు ఆయన టాప్ హీరో అయ్యారు. ఇక చిరంజీవి నటించిన ఇంద్ర, ఠాగూర్ వంటి మూవీస్ ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆయన ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
Read Also : Singer Chinmayi : తెలంగాణలో ఆడవాళ్లపై చిన్మయి సంచలన కామెంట్స్.. భర్తలను ఎందుకు భరిస్తున్నారంటూ..!