Chammak Chandra : చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్? ఛాన్స్ దక్కుతుందా?

chandra-re-entry-into-zabardast.html
chandra-re-entry-into-zabardast.html

Chammak Chandra : పాపులర్ కామెడీ షోల్లో జబర్దస్త్ టాప్. ఈ ప్రోగ్రాం మొదలైన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే చానల్స్‌లో స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజులుగా ఈ ప్రోగ్రాం నుంచి తప్పుకున్న చమ్మక్ చంద్ర తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. జబర్దస్త్‌కు ఆయన దూరమై దాదాపు ఏడాదిన్నర కావోస్తోంది.

ఆయన ఈ షో మానేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. నెటిజన్స్ సైతం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. వెంటనే జబర్దస్త్ లోకి రావాలని అతన్ని కోరుతున్నారు. అయితే జబర్దస్త్ నుంచి చంద్ర బయటకు వెళ్లిన తర్వాత ఏ షో చేసిన సాటిస్‌ఫై కావడం లేదట ఆయన. అదిరింది షోలోనూ చాలా మార్పులు చేశారు అయిన అది సక్సెస్ కాకపోవడంతో దానిని పూర్తిగా ఆపేశారు. దీంతో అందులో చేసే కమెడియన్స్ పరిస్థితి దారుణంగా మారింది.

Advertisement

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో ఆయన పర్ఫార్మ్ చేస్తున్నాడు. కానీ ఈ షోతో ఆయన సాటిస్‌ఫై కావడం లేదట. రెమ్యునరేషన్ బాగానే ఉన్నా.. ఆయన ఎందుకో అసంతృప్తితో ఉన్నాడని టాక్. జబర్దస్త్‌ నుంచి చమ్మక్ చంద్ర వెళ్లిపోయిన తర్వాత ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేకపోయారు.

ఎంత మంది పర్ఫార్మ్ చేసిన చంద్ర స్క్రిట్ లేని లోటు అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఆయన తిరిగి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ ఆయనకు చాన్స్ లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చమ్మక్ చంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆయనను ఇంతకు జబర్దస్త్‌లోకి తిరిగి తీసుకుంటారా? లేదా? అన్నది సస్పెన్స్.

Advertisement

Read Also : Mahesh Babu : హీరో మహేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.. అన్నయ్యా.. నాకు అన్నీ నువ్వే..!

Advertisement