...

Vishwak sen: విశ్వక్ సేన్ పై హెచ్చార్సీలో కేసు నమోదు.. ప్రాంక్ వీడియో చేసినందుకేనట!

సినిమా ప్రచారం పేరిట ప్రాంక్ వీడియోతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ నటుడు విశ్వక్ సేన్ పై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. విశ్వక్ పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్ కు అంతరాయం కల్గిస్తున్నారని స్పష్టం చేశఆరు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనీయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హెచ్చార్సీని కోరినట్లు వెల్లడించారు.

హీరోలు చేసే ఇళాంటి ప్రయత్నాలు యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, యూట్యూబ్ లో ఉన్న ఇలాంటి వీడియోలన్నింటినీ తొలగించాలన్నారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఆశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర బృందం నగరంలోని ఓ రహదారిపై ప్రాంక్ వీడియో చేసింది. ఇందులో ఓ వ్యక్తి చనిపోతానంటూ బెదిరించడం కలకలం రేపింది. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ తిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది. అలాగే ఈ సినిమాని బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు.