...
Telugu NewsDevotionalDevotional Tips: ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా... ఉంటే ఎలా పూజించాలో తెలుసా?

Devotional Tips: ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా… ఉంటే ఎలా పూజించాలో తెలుసా?

Devotional Tips: సాధారణంగా ఎంతోమంది ఇంట్లో శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు. అయితే శంఖం ఒక అలంకరణ వస్తువు కాదు. ఆధ్యాత్మికంగా శంకువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక శంఖువుని ఒక అలంకరణ వస్తువుగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవితో పాటు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. అందుకే గవ్వలను లేదా శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువులుగా భావించి పూజిస్తారు. ఈ విధంగా మన ఇంట్లో శంఖం ఉంటే దానిని పూజ గదిలో ఉంచి పూజించాలి.

Advertisement

పూజ గదిలో ఎల్లప్పుడు తెలుపు రంగులో ఉన్న శంఖం ఉండాలి. ఒక వెండి ప్లేట్ లో బియ్యం పోసి బియ్యం పై శంఖం ఉంచి శంఖానికి పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు దూప దీపంతో శంఖాన్ని పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలంటే ప్రతి శుక్రవారం అలాగే పౌర్ణమి అమావాస్య రోజు శంఖాన్ని అభిషేకం చేసే పూజించాలి. ఈ క్రమంలోనే ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమి అమావాస్య రోజు పసుపు నీటితో శంఖం కడిగి అనంతరం పాలతో అభిషేకం చేయాలి.

Advertisement

అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో శంఖాన్ని పూజించాలి. ఈ విధంగా పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండేలా కాపాడుతుంది. ఇంట్లో శంఖం ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే శంఖం ఇంట్లో ఉన్నప్పుడు ఆ శంఖాన్ని ఆధ్యాత్మిక వస్తువుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు