Bigg Boss Telugu OTT Live : తెలుగు బిగ్ బాస్ అయిదు సీజన్ లకు మంచి ఆధరణ లభించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలు అయిన బిగ్ బాస్ ఆ తర్వాత నాని హోస్ట్ గా చేసినా ఆ తర్వాత నాగార్జున వరుసగా మూడు సీజన్ లు చేసినా ప్రతి ఒక్క సీజన్ ను కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆధరించారు. హిందీ బిగ్ బాస్ కంటే ఎక్కువ రేటింగ్ నమోదు అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీని తీసుకు వచ్చేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సిద్దం అయ్యారు. ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ స్ట్రీమింగ్ కూడా మొదలు పెట్టారు.
నాన్ స్టాప్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా చూశారు. కాని లైవ్ ను కనీసం పది నిమిషాలు కూడా చూడలేక పోతున్నాం అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. సౌండ్ నాయిస్ చాలా ఇబ్బందిగా ఉండటం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ను కూడా చూపించకుండా చాలా సమయం ఒక్కరినే లేదా ఒకే సంఘటనను చూపిస్తూ ఉన్నారు. దాంతో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నా కూడా జనాలు పెద్దగా చూడటం లేదు.
Bigg Boss Telugu OTT Live : లైవ్ స్ట్రీమింగ్‌లో నిజమెంత?
నిర్వాహకులు ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్ లో షో ను చూసేందుకు అత్యధికంగా లాగిన్ అయ్యారని ప్రకటించారు. కాని రెగ్యులర్ బిగ్ బాస్ తో పోల్చితే మాత్రం చాలా నీరసంగానే ఈ షో సాగుతుందని అనిపిస్తుంది. లైవ్ అంటున్నారు కాని వారి మాటలు మరియు వారి చేష్టలు చూస్తుంటే లైవ్ అయ్యి ఉండక పోవచ్చు అనిపిస్తుంది.
కనీసం గంట లేదా రెండు గంటలు ఆలస్యంగానే షో ను స్ట్రీమింగ్ చేస్తున్నారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ అయ్యి ఉండక పోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. ఇక ఆ లైవ్ స్ట్రీమింగ్ అని చెబుతున్నదాన్ని ఎంత మంది చూస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అనే సమాధానం వినిపిస్తుంది. మొత్తానికి బిబి ఓటీటీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేక పోతుందనే చెప్పాలి.
Read Also : Big Boss OTT Telugu: ఎంత మందితో రిలేషన్ లో ఉన్నానో నాకే తెలియదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!