Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ మధ్య గొడవలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక విషయం గురించి గొడవ జరిగితే పదేపదే అదే విషయం గురించి మాట్లాడుతూ గొడవ మరింత పెద్దది చేస్తుంటారు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య గొడవలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడో వారం నామినేషన్ లో భాగంగా కంటెస్టెంట్ మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. ముఖ్యంగా అఖిల్ బిందుమాధవి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి.
ఏడవ వారంలో భాగంగా బిగ్ బాస్ నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిందు మాధవి, అఖిల్ రెచ్చి పోయి ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ వారం జంట నామినేషన్లని చెప్పిన బిగ్ బాస్ అఖిల్, బిందుమాధవి మధ్య చిచ్చు పెట్టారు.అఖిల్ గతవారం బిందుమాధవికి కోపం ఎక్కువ అంటూ నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వారం కూడా అదే కారణంతో అఖిల్ బిందుమాధవిని నామినేట్ చేశారు.
ఈ విధంగా వీరిద్దరి మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పోయింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిందుమాధవి ఒరేయ్ అఖిల్ గా చెప్పురా అంటూ సంబోదించగా… అఖిల్ ఏ మాత్రం తగ్గకుండా ఒసేయ్ ఏం చెప్పాలే బిందు అంటూ మరింత రెచ్చి పోయాడు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో తెలియాల్సి ఉంది.