Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమము ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఐదుగురు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా వాడివేడిగా జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.
ఈ విధంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా హమీద, అఖిల్ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ తర్వాత అషురెడ్డి హమీదాల మధ్య గొడవ జరిగింది. ఇలా నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఒకరిపై మరొకరు దూషించుకుంటూ పెద్దఎత్తున ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ లో భాగంగా పది మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.
ఈ నామినేషన్ ప్రక్రియలో అఖిల్, అజయ్, అరియానా మినహా మిగిలిన కంటెస్టెంట్ లు మిత్ర శర్మ, నటరాజ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. మరి ఎంతో రసవత్తరంగా కొనసాగిన నామినేషన్ ప్రక్రియలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు రానున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World