...

Bigg Boss 5 Telugu Elimination: ఏంట్రా ఇది.. షణ్ను కాదుగా.. కాజల్ ఎలిమినేట్!

Bigg Boss 5 Telugu Elimination: ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. రెండు వారాల క్రితం ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేషన్ సంచలనంగా మారింది. ఇప్పుడు హౌజ్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ షణ్ముక్ కూడా ఎలిమినేట్ అవుతాడటంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, బిగ్ బాస్ హౌజ్ కదా.. ఈ వారం ఎలిమినేట్ కాబోయేది షణ్ముక్ కాదట.. అంతా తూచ్.. ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయినట్టు వార్త్ లీక్ అయింది.

బిగ్ బాస్ 5 తెలుగు రియాల్టీ షోలో 14వ వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ గా కాజల్ హౌజ్ నుంచి బయటకు వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ 14వ వారంలో సిరి హన్ముంతు, షణ్ముక్, కాజల్, సన్నీ, మానస్ ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషనల్‌లో ఉన్నారు.

అయితే వీరిలో షణ్ము, సన్నీ ఎలాగో సేవ్ అవుతారనే టాక్ నడిచింది. షణ్ను ఎలిమినేట్ అవుతారనుకున్నారంతా.. నెగటివిటీ మూటగట్టుకున్న షణ్ను హౌజ్ నుంచి బయటకు వచ్చేస్తాడని అనుకున్నారు. కానీ, అదంతా ఫేక్ అని అంటున్నారు. షణ్ను, సన్నీకి భారీగా ఓట్లు వచ్చాయట.. మానస్ కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి.

Bigg Boss 5 Telugu Elimination: సిరి సేఫ్.. కాజల్‌ను బయటకు పంపేశారుగా..!

సిరి, కాజల్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అవుతారని టాక్ నడించింది. అయితే వీరిద్దరిలో సిరి సేఫ్ అయి.. కాజల్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. టాప్ 5లోకి అడుగుపెట్టేందుకు ఆశగా ఎదురుచూస్తున్న కాజల్ కు నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది.

ప్రతివారం ఎలిమినేషన్ కత్తి నుంచి తప్పించుకుంటు వస్తున్న కాజల్ చివరి అంచుల వరకు వెళ్లి మరి సేవ్ అయింది. ఈసారి కాజల్ ఎలిమినేషన్ అనివార్యమే టాక్ నడుస్తోంది. ఇప్పటికే శ్రీరామచంద్ర టాప్ ఫైనాలిస్టుగా చేరిపోయాడు. ఆ తర్వాత సన్నీ రెండో ఫైనలిస్టుగా చోటు సంపాదించుకున్నాడు. ఇక మిగిలిన షణ్ను, సిరి, మానస్‌ ముగ్గురు కూడా తర్వాతి టాప్ 5 ఫైనాలిస్టులో చేరనున్నారు. సిరిని కాపాడటానికే ఈవారం కాజల్‌ను బయటకు పంపిస్తేన్నారంటూ బిగ్ బాస్ షోపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Bigg Boss 5 Telugu : సిరి, షన్నూ మధ్యలో రాజుకున్న వివాదం.. కాజల్‌ను వెళ్లగొట్టేందుకు ప్లాన్..?