Best Stones Zodaic Signs : రంగు రాళ్లు, రత్నాలకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రాశి వారికి ఒక్కో రత్నం స్పెషల్ గా చేయించి ఇస్తుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అంతే కాదండోయ్ తమకు బాగా కనెక్ట్ అయిన రత్నం ధరించడం ద్వారా ఆయా రాశుల వారు చాలా ప్రయోజనం కూడా పొందవచ్చని చెబుతున్నారు. అయితే ఏ రాశి వారికి ఏ రత్నం ధరిస్తే… అదృష్టం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి వారికి లక్కీ స్టోన్ గా గార్నెట్ నిలుస్తుంది.. దీన్నే ఎరుపు పగడపు రత్నం అంటారు. దీన్ని ధరించడం వల్ల లక్కు వ్తుందట. రెండోది వృశభ రాశి.. ఈ రాశి వారికి ఉత్తమ రత్నం ఒపల్ లేదా డైమండ్. దీన్నిధరించడం వల్ల దంపతుల బంధంలో గొడవలు తగ్గి అనురాగం, శాంతి పెరుగుతుంది. మూడోది మిథున రాశి. వీరికి జాడే లేదా ఎమెరాల్డ్ బెస్ట్ స్టోన్ గా ఉంటుంది. ఈ రెండు రత్నాలు అనవసరమైన ఆలోచనలు, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. ఇవి రెండూ ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
నాలుగోది కర్కాటక రాశి.. వీరికి అదృష్ట రత్నాలు పెరల్స మూన్ స్టోన్. ఈ రెండు రత్నాలు అనవసరమైన ఆలోచనలు, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. ఇవి రెండూ ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఐదోది సింహరాశి వారికి రెడ్ స్పినెల్ లేదా ఎల్లో స్పినెల్ బెస్ట్ స్టోన్ గా నిలుస్తుంది. కంటి చూపును మెగురుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోది కన్యారాశి. వీరికి ఎమరాల్ట్ గ్రీన్ టూర్మాలిన్ అదృష్టంగా చెప్తారు. దీన్ని ధరించడం వల్ల అదృష్ట దేవత ఎప్పుడూ వీరితోనే ఉంటుందట.
Read Also : Palmistry : అరచేతిలో ఈ గీత ఉంటే విదేశాలకు వెళ్తారు.. ఉందో లేదో చూసుకోండి
ఏడోది తులారాశి. వీరికి వైట్ క్వార్ట్జ్ లేదా డైమెండ్ బెస్ట్ స్టోన్స్. వీటిని ధరించడం వల్ల ప్రశాంతత, పాజిటివిటీ పెరుగుతుంది. ఎనిమిదోది వృశ్చిక రాశి.. వీరికి కార్నెలియన్ లేదా రెడ్ కోరల్ అదృష్ట రత్నాలుగా చెబుతుంటారు. కార్నెలియన్ ఎనర్జీ, మోటివేషన్‌ని రీస్టోర్ చేస్తుంది. అలాగే ఇది క్రియేటివిటీని, ధైర్యాన్ని కూడా పెంచుతుంది. తొమ్మిదోది ధనస్సు రాశి.. వీరికి రూబీ, ఎల్లో సఫైర్ లక్కీ స్టోన్స్ గా సూచిస్తున్నారు. ఈ రత్నాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి.. పాజిటివ్ ఎనర్జీని పెంపొందించడానికి సహాయపడతాయి.
పదోది మకర రాశి.. వీరి అదృష్ట రత్నాలు బ్లూ సఫైర్, డైమ్ండ్. అథ్యాత్మిక మార్గంలో నడించేందుకు.. భయాన్ని పోగొట్టేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పదకొండోది కుంభ రాశి.. వీరికి బ్లూ సఫైర్ లేదా ఐయోలైట్ బెస్ట్ స్టోన్స్. వీటిని ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. పన్నెండోది మీన రాశి.. వీరికి నాచురల్ పెరల్ లేదా సహజ ముత్యం అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాయి. అయితే పైన చెప్పిన విధంగా మీ రాశికి తగిన రత్నం ధరించి అదృష్టాన్ని పొందండి.
Read Also : Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి