Kidney Patients : మానవ శరీరంలో మూత్ర పిండాలు అంటే కిడ్నీలు ఎంతో ముఖ్యమైన అవయవం. ఇవి మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయ పడతాయి. మర శరీరంలో వ్యర్తాలను తొలగించడానికి తోడ్పడతాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడం సహా రక్త పోటును నియంత్రించే హార్మోన్లను స్రవిస్తాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ ప్రకారం… కిడ్నీలను ప్రభావితం చేసే ఐదు ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది మద్యం.. అతిగా మద్యం సేవించడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. మితిమీరిన ఆల్కహాల్ వినియోగం మూత్ర పిండాల పనితీరులలో సమస్యలను కల్గిస్తుంది. ఇది మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల కడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా ఇతర అవయవాలకు కూడా హాని కల్గిస్తుంది. రెండోది ఉప్పు.. ఉప్పులో సోడియం లేదా పొటాషియం ఉంటాయి. ఇది శరీరంలో సరైన మొత్తంలో ద్రవాన్ని నిర్వహిస్తుంది. అయితే ఉప్పును ఆహారంలో తీసుకుంటే అది అధిక ఒత్తిడి, మూత్ర పిండాలకు హానీ కల్గించే ద్రవం మొత్తాన్ని పెంచుతుంది.
మూడోది పాల ఉత్పత్తులు.. పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మూత్ర పిండాలకు మంచిది కాదు. పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోండి. నాలుగోది అతి మాంసాహారం… మాంసాహారాన్ని ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అలాంటి క్రమంలో మాంసాన్ని జీర్ణం చేయడం శరీరానికి కష్టం అవుతుంది. అలాగే ఐదోది కృత్రిమ స్వీటెనర్.. మార్కెట్ లలో లభించే స్వీట్లు కుకీలు, పానీయాల్లో కృత్రిమ తీపి పదార్థాలను విరివిగా వినియోగిస్తారు. ఇవి కడ్నీలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.