Bandla Ganesh : వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishana) మాట్లాడుతూ.. ఆ రంగారావు.. ఈ రంగారావు… అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా మండిపడ్డారు. బాలయ్య వ్యాఖ్యలపై నాగ చైతన్య, అఖిల్ సైతం స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు గొప్ప వ్యక్తిని, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు.

Bandla Ganesh Tweets On Balakrishna Akkineni issue with Chiranjeevi Name in his post
అందులో బాలకృష్ణ పేరును అక్కినేని హీరోలు ప్రస్తావించలేదు. కానీ, ఈ విషయంలో బాలకృష్ణ ఫ్యాన్స్, సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు అక్కినేని హీరోలను తప్పుబడుతున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని అంటున్నారు. బాలయ్య ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండరని, ఆయన నుంచి వివరణ తీసుకుని ఉండాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.
Bandla Ganesh : బండ్ల గణేష్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్.. !
ఈ క్రమంలో నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశఆయి. బండ్ల గణేష్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా పరోక్షంగా విమర్శించారు. అయితే, బండ్ల గణేష్ నాగచైతన్య, అఖిల్ ట్వీట్‌లకు చిరంజీవి సార్ అని మెగాస్టార్ పేరు ట్యాగ్ చేశారు.
వెంటనే బాలయ్య ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ బండ్ల గణేష్‌ను ఏకిపారేశారు. మెగా బ్యాచ్‌కు భజన చేస్తున్నావంటూ బండ బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఏదో పొరపాటున బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ ఇంత రాద్ధాంతం చేయరాదని బాలయ్య బాబు ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.
We respect NTR,ANR , SVR & Chiranjeevi sir 🙏 https://t.co/loA301SpkR
— BANDLA GANESH. (@ganeshbandla) January 24, 2023
Advertisement
బండ్లగణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. చిరంజీవి పేరును బండ్లగణేష్ చేర్చడాన్ని ఇరువురి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి లెజెండ్ హీరోలు నీకు కనిపించడం లేదాని తిట్టిపోస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు బండ్ల గణేష్‌ని బండ బూతులు తిట్టేస్తున్నారు. బాలయ్య ఏం మాట్లాడావో తెలుసుకోకుండా నీ వెదవ వేషాలు ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
This is the reason for his tweet 👇👇👇 pic.twitter.com/d0be0s2Hxn
Advertisement— ラジェッシュ 🙋 (@rajeshtweets11) January 24, 2023
Read Also : Viral video : పొట్టి బట్టల్లో బుల్లెట్టు పాటతో పిచ్చెక్కించిన యువతి.. డాన్స్ వీడియో వైరల్!