Ante Sundaraniki Barthhday Homam : నేచురల్ స్టార్ నాని మరో కొత్త మూవీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వస్తున్నాడు. ఈ ఏడాదిలో శ్యామ్ సింగరాయ్ మూవీతో మంచి హిట్ అందుకున్న నాని.. మరోసారి అందరిని నవ్వించేందుకు రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న నాని రామ్-కామ్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి..’ (Ante Sundaraniki) మూవీతో నవ్వులు పూయించేందుకు ముందుకు వస్తున్నాడు. ప్రొడక్షన్ పనులు కూడా అయిపోయాయి. వచ్చే సమ్మర్‌లో థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అందుకే ముందుగా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.. అంతేకాదు.. ‘అంటే సుందరానికి’ బర్తడే హోమాన్ని కూడా ఆవిష్కరించింది.
నాని హోమం చేస్తూ పడుతున్న పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ‘అంటే సుందరానికి’ బర్తడే హోమం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో నాని పాత్ర చాలా ఇంట్రెస్టింగా ఉంటుందట.. తన కుటుంబంలో తాను ఎదుర్కొనే అనే సమస్యలతో సతమతమయ్యే ఒక అమాయక బ్రాహ్మణుడిగా నటించాడు. తన జీవితంలో అనే గండాలు ఉన్నాయని, అతడికి ఇంట్లో తరచుగా హోమాలు చేయిస్తుంటారు తల్లిదండ్రులు.
ఇలా హోమాలు చేయమని అతన్ని బలవంతం చేస్తుంటారు. ఈ విషయంలో పదేపదే చిరాకు పడే నాని.. తన నటనతో చిన్నపిల్లాడిలా అమ్మా, అమ్మమ్మతో వాదన పెట్టుకోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షుకుల్లో నవ్వులను పూయిస్తున్నాయి. వీడియోకు ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో చూసిన నాని అభిమానులు సైతం అంటే సుందరానికి బర్త్ డే విషెస్ అంటూ సరదగా కామెంట్లు చేస్తున్నారు.
నాని పూర్తి వినోదాత్మక పాత్రలో కనిపించాడు. అంటే సుందరానికీ సినిమాతో తెలుగులో నజ్రియా నజీమ్ ఫహద్ మంచి ఆరంభాన్ని అందిస్తుంది. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. జూన్ 10వ తేదీ నుంచి థియేటర్లలో నాని అంటే సుందరానికి మూవీ సందడి చేయనుంది. ఇందులో ‘అంటే… మావాడి జాతకం ప్రకారం.. బర్త్‌డే హోమం జరిగిన 108 రోజుల వరకు బయటికి రాకూడదట.. అందుకే జూన్ 10న అందరిని నవ్వించడానికి వస్తున్నాడు `హ్యాపీ బర్త్‌డే సుందర్, బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు ,” అని మేకర్స్ ప్రకటించారు.