Anchor Suma: ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా గత కొంత కాలం నుంచి క్యాష్ దొరికినంత దోచుకో అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమ పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో తనదైన శైలిలో ఆటలు ఆడుతూ సరదాగా పాటలు పాడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ సమయంలోనే గతంలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రేటింగ్ వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోయిందని చెప్పాలి. ఇలా ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమానికి ఇలా ప్రేక్షకాదరణ తగ్గడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత ప్రేక్షకాదరణ తగ్గడానికి మొదటి కారణం ఈ కార్యక్రమానికి వస్తున్న సెలబ్రిటీలని చెప్పాలి.ఇలా ఈ కార్యక్రమానికి తీసుకు వచ్చిన వారినే తీసుకు రావడం లేదు అంతేకాకుండా ముక్కు మొహం తెలియని వారిని తీసుకు రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రేక్షకులు ఇష్ట పడటం లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా సుమ సెలబ్రిటీలతో ఆడించిన ఆటలు తిరిగి ఆడించడం వల్ల ఈ కార్యక్రమాన్ని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఇక ఈ కార్యక్రమానికి రేటింగ్స్ తగ్గడానికి మూడవ కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ఇతర చానల్స్ లో మరి కొన్ని కార్యక్రమాలు ప్రసారం కావడం వల్ల ఈ కార్యక్రమం చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఇష్టపడటం లేదు అందువల్ల ఈ కార్యక్రమం పూర్తిగా రేటింగ్స్ పడిపోయాయి. ఇకనైనా మల్లెమాల వారు ఈ కార్యక్రమాన్ని సరికొత్త హంగులతో కొత్తగా ప్లాన్ చేస్తే ఈ కార్యక్రమం తిరిగి పుంజుకుంటుంది. లేదంటే ఈ కార్యక్రమానికి మరింత గడ్డు కాలం ఏర్పడే పరిస్థితి వస్తుందని చెప్పాలి.