Anchor suma: యాంకర్ సుమ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు, వారి సత్కారాన్ని పొందేందుకు యాంకర్ సుమ న్యూయార్క్ వెళ్లింది. సుమతో పాటుగా యాంకర్ రవి కూడా తన ఫ్యామిలీని వెంటబెట్టుకొని వెళ్లాడు. అలా సుమ, రవి ఇద్దరూ కలిసి అక్కడి ప్రోగ్రాంను హోస్ట్ చేశారు. అయితే గత వారం నుంచి సుయ న్యూయార్క్ లోనే సందడి చేస్తోంది. అక్కడ చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూనే ఉంది.
ఇక రెస్టారెంట్లలో రోబోలు చేసే సర్వీసుల గురించి చెబుతూ సుమ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. తాను టాటా వారు సన్మానించిన తీరుకు సున ఉప్పొంగిపోయారు. ఇక ఇవన్నీ కాకుండా సుమ అయితే న్యూయార్క్ నగరంలో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన టీంతో కలిసి రోడ్డు మీద రచ్చ చేసింది. న్యూ యార్క్ నడి వీధుల్లో రీల్ వీడియో చేసింది. హిలపతి హబీబీ.. అంటూ సుమ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
సుమ డ్రెస్సుతో పాటు, ఆమె వేసిన స్టెప్పులు కూడా అందర్నీ నవ్వించేలా ఉన్నాయి. మొత్తానికి సుమ మాత్రం న్యూయార్క్ లో చాలా ఎంజాయ్ చేస్తోంది. సుమ ఎప్పుడు రిటర్న్ అవుతుందో కానీ ఇక్కడ మాత్రం షూటింగ్ లు అన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.