Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అదుర్స్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈమె అంతకుముందు వెండితెరపై పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.ఈ విధంగా అదుర్స్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేసింది.ఈ విధంగా బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరికాస్త పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇలా వరుస టీవీ షోలతో దూసుకుపోతున్న శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత కాస్త విరామం తీసుకున్నారు. అయితే తాజాగా ఈమె అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై వరుస అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు. ఇప్పటికే సరిగమప కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వెండితెరపై సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా బుల్లితెర రాములమ్మకి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఈటీవీలో మల్లెమాల సంస్థ వారు నిర్వహిస్తున్న కామెడీ షో ల గురించి మనకు తెలిసిందే.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కామెడీ షోలను నిర్వహిస్తూ అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుంటున్న మల్లెమాల సంస్థ తాజాగా మరొక కామెడీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈటీవీ ప్లస్ లో మల్లెమాల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జాతి రత్నాలు అనే కార్యక్రమం ద్వారా మరోసారి శ్రీముఖి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా శ్రీముఖి ఎంట్రీ ఇస్తూనే రాననుకున్నారా… రాలేననుకున్నారా రాములమ్మ ఇస్ బ్యాక్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.