...

Anchor Rashmi : రహస్యంగా వివాహం చేసుకున్న యాంకర్ రష్మీ… ఎవరినంటే!

Anchor Rashmi : టాలీవుడ్ టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు హాజరవుతూ భారీ క్రేజ్ ఏర్పరుచుకున్నారు.

ఇదిలా ఉండగా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోని ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇలా వీరి గురించి వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తామిద్దరం మంచి స్నేహితులం అని రష్మీ సుధీర్ వారి ప్రేమ గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే తాజాగా రష్మికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anchor Rashmi – Sudheer – : కెరియర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో…

యాంకర్ రష్మి ఎవరికి తెలియకుండా రహస్యంగా గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే వివాహం చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తిని రష్మీ పెళ్లి చేసుకుందని ప్రస్తుతం అతనితో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటుందని తెలుస్తోంది.

ఇక తనకు పెళ్లి అయిన విషయం బయటపడితే తనకు అవకాశాలు తగ్గిపోయి తన కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయని అందుకే తన పెళ్లి విషయం బయట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై రష్మీ స్పందించాల్సి ఉంది.

Read Also : Bheemla Nayak Movie : వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్, రానా ” భీమ్లా నాయక్ “మూవీ రన్ టైమ్…