బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్లికి ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే వీరిద్దరి వివాహం ఏప్రిల్వ తేదీన ఆర్ కే స్టూడియోస్ లో జరగపోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాజ్ కపూర్ నివాసాన్ని కూడా ముస్తాబు చేస్తున్నారు. వివాహం కోసం ఆలియా, రణబీర్ లకు డిజైనర్ దుస్తులు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలియా కోసం సవ్యసాచి, మనీష్ మల్హోత్రలు డిజైన్ చేశారట. అంతే కాదండోయ్ పెళ్లి తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల ప్రముఖులకు భారీగా విందును ఇవ్వబోతున్నారట. అయితే ఏప్రిల్ 17వ తేదీన ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ లో రిసెప్షన్ జరగబోతోందట.
ఆలియా, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి దాదాపు 45 నుంచి 50 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే ఆలియా సోదరుడు రాహుల్ భట్ మాత్రం కేవలం 28 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు చెప్పడం గమనార్హం. ఇరు కుటుంబాలకు సంబంధించిన వారితో పాటు కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ తదితరులు అతిథుల జాబితాలో ఉన్నారు. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలను చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సంగీత్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.