Alia Bhatt Ranabir Wedding : బాలీవుడ్ మోస్ట్ క్రషింగ్ పెయిర్ ఆలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి తంతు ముగిసింది. ఇన్నాళ్లుగా ప్రేమ పక్షులుగా విహరించిన వీరిద్దరూ… పెళ్లితో ఒకటయ్యారు. పంజాబ్ సంప్రదాయం ప్రకారం.. అతి తక్కువ మంది బంధువుల మధ్య వీరి వివాహం జరిగింది. బాంద్రాలోని ఆపార్ట్ మెంట్ లో జరిగిన ఈ పెళ్లికి దగ్గరి స్నేహితులతో పాటు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆలియా తల్లి దండ్రులతో పాటు రణబీర్ కుటుంబ సభ్యులే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకున్నారు.
తమ జీవితాంతం స్పెషల్‌గా చెప్పుకునే ఈ పెళ్లి వేడుకలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా రణ్‌బీర్-ఆలియా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందుకే ఆలియా కజిన్ మోన్న ఈ పెళ్లి ఏప్రిల్ 14న జరగడం లేదంటూ ప్రకటన కూడా చేశారు. అయితే ఈరోజే పెళ్లి జరగింది. కానీ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మాత్రం బయటకు రానీయలేరు. అంతే కాకుండా పెళ్లికి వచ్చిన వారందరీ సెల్‌ఫోన్ కెమెరాలకు సిబ్బంది స్టిక్కర్లు అతికించారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల సమయంలో తమ పెళ్లి తొలి ఫొటోని సోషల్‌మీడియాలో ఆలియా-రణ్‌బీర్ పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.