బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్.. చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ ల పెళ్లి గురించి ఆసక్తి కరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న వీరి వివాహం ఈ నెల 14వ తేదీన జరగబోతున్నట్లు ప్రకటించారు. అదుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెళ్లి కావాల్సిన బట్టలు సహా అన్ని ఫంక్షన్ల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లుండే పెళ్లనగా.. ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. శనివారం జరగబోయే పెళ్లి మరోసారి వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలియా హాఫ్ బ్రదర్ రాహుల్ చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆలియా, రణ్బీర్ కపూర్ ల వివాహ విషయంపై స్పందించారు. అయితే ఏప్రిల్ 14న వీరి వివాహం చేసుకోవాలని అనుకోగా.. అనుకోని పరిస్థితుల కారణంగా మార్చా్సి వచ్చిందని తెలిపారు. అయితే ఎంత గోప్యత పాటించినప్పటికీ ఈ విషయం బయటకు వచ్చిందన్నారు. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మెహందీ, హల్దీ సహా అన్ని వేడుకల తేదీల్లో మార్పులు చేశారు. అలా పెళ్లి తేదీని కూడా మార్చారు. ఏప్రిల్ 20న వీరి వివాహం జరగవచ్చు” అని అన్నారు.