Pranitha Subhash : తల్లిని కాబోతున్నానంటూ హీరోయిన్ ప్రణీత పోస్ట్..!

Pranitha Subhash
Pranitha Subhash

Pranitha Subhash : అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చేపకళ్ల చిన్నది ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులతో పంచుకుంది. ఇన్ స్టా వేదికగా భర్తతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

actress-pranitha-subhash-announce-her-pregnancy-news
actress-pranitha-subhash-announce-her-pregnancy-news

అయితే ఈ పోస్టులో.. ” నా భర్త 34వ పుట్టిన రోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు” అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకుంది. ప్రణీత పెట్టిన పోస్టుపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.

Advertisement

అయితే ప్రణీత.. అత్తారింటికి దారేది, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ చోటును సంపాదించుకుంది. కరోనా సమయంలోనూ పేదల కోసం ఆమె తనవంతు సాయం చేశారు. బెంగళూరుకు చెందిన వ్యాపార వేత్త నితిన్‌ రాజుని గతేడాదిలో వివాహం చేసుకున్నారు.

Read Also : Niharika : నా పైనా ఎన్ని న్యూస్ రాసుకున్నా.. నాకు ఏమాత్రం ఫరక్ ఉండదు.. నిహారిక షాకింగ్ కామెంట్స్!

Advertisement