...

Job notifications: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే జాబ్ నోటిఫికేషన్స్

నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగార్థులకు సర్కారు శుభవార్త చెప్పనుంది. వచ్చే నెల మొదటి వారం లోపు ఒకటి లేదా రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 34 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు అంటున్నారు. నోటిఫికేషన్ల జారీకి ముందు చేయాల్సిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ కసరత్తు నెలాఖరులోపు పుర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అటు స్థానికత నిర్ధరణ కోసం ఓటీఆర్ లో సవరణ చేసుకునేందుకు అభ్యర్థులు ఇంకా అంతగా ఆసక్తి చూపడం లేదు. 20 లక్షలకు పైగా అభ్యర్థులకు గానూ సవరణ చేసుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు లక్షన్నర లోపే ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

503 గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాల నియామకానికి అనుమతులు మంజూరు చేసింది. దాదాపుగా 34 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల అనంతరం ఆయా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసే కసరత్తును పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా ఇతర నియామక సంస్థలు మొదలు పెట్టాయి.

 

ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి టీఎస్పీఎస్సీకి అవసరమైన వివరాలు పంపించారు. అయితే కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన సర్వీసు నిబంధనలతో పాటు ఇతరత్రాలకు సంబంధిచి చిన్న చిన్న సవరణలు ప్రభుత్వ ప రిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సవరణలు చేయకపోతే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.