Pravaite Company: సాధారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదా ఏదైనా పండుగలకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా ఇంక్రిమెంట్ పెంచడం వల్ల ఉద్యోగులు తమ ఆఫీసులో ఎంతో నిబద్ధతతో పని చేస్తారని ఇతర ఆఫీస్ లోకి వెళ్లి ఆలోచనలను మానుకుంటారని సంబంధిత కంపెనీ ఇలా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెంచుతూ ఉంటారు.అయితే తమిళనాడుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెంచడమే కాకుండా మంచి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
తమిళనాడులోని మధురైలో ఉన్న శ్రీ మూకాంబికా ఇన్ఫో సోల్యుషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ కంపెనీ సీఈఓ సెల్వగణేష్ మాట్లాడుతూ… తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరానికి రెండుసార్లు ఇంక్రిమెంట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.అలాగే ఇంక్రిమెంట్ తో పాటు తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మంచి పెళ్లి సంబంధాలు కూడా వెతికే విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈఓ సెల్వ గణేష్ తెలియజేశారు.ఇలా తమ ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు వెతకడం వెనుక కూడా ఒక కారణం ఉందని ఆయన వెల్లడించారు.
ఉద్యోగులకు కావలసిన సదుపాయాలన్నింటిని తమ కంపెనీ చూసుకోవడంతో ఆ ఉద్యోగులు తమ కంపెనీ వదిలి ఇతర కంపెనీలకు వెళ్లకుండా ఆ కంపెనీ వృద్ధి కోసం కష్ట పడతారని, వారి కష్టానికి అనుగుణంగా ప్రతి ఏడాది ఈ రెండు ఇంక్రిమెంట్లు పెంచుతున్నామని ఆయన తెలియజేశారు. అలాగే పెళ్లయిన వారికి కూడా ప్రత్యేకమైన ఇంక్రిమెంట్ ఉంటుందని సీఈఓ సెల్వగణేశ్ తెలియజేశారు.తమ కంపెనీ ఉద్యోగులకు కావలసిన అవసరాలను చూడటం వల్ల దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల నుంచి తమ కంపెనీలో నమ్మకంగా పని చేస్తున్నారని గణేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.