...

Viral Video: సరికొత్త టిష్యూ పేపర్ కనుక్కొన్న అతిథి.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

Viral Video:సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే ఆ ఘటనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎన్నో పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాస్యాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే వధూవరుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు, కొట్టుకోవడం వంటి వీడియోలు కోకొల్లలుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సాధారణంగా మన భారతీయ సంప్రదాయాల ప్రకారం చేసే పెళ్లి అంటేనే ఎన్నో రకాల విందు భోజనాలు ఏర్పాట్లు చేస్తారు. ఈ విందు భోజనాల వద్ద కూడా ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రవర్తన అందరికీ నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక పెళ్లిలో అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉండగా ఒక పెద్దాయనకు
టిష్యూ పేపర్ అవసరం ఏర్పడింది. అయితే అక్కడ టిష్యూ పేపర్ లేవు. ఇలా టిష్యూ పేపర్ లేకపోతే మనం మన వెంట తీసుకెళ్లిన కర్చీఫ్ ద్వారా శుభ్రం చేసుకుంటాము.

 

View this post on Instagram

 

A post shared by Sen Sen (@sensen4947)

అయితే ఈ వీడియోలో మాత్రం ఈ పెద్దాయనకు టిష్యూ పేపర్ అవసరం ఏర్పడింది. అయితే అక్కడ టిష్యూ లేకపోవడంతో సరికొత్త టిష్యూని కనుగొన్నారు. ఇంతకీ ఆ టిష్యు ఏమిటి అనుకుంటున్నారా. భోజనాలలో భాగంగా ఏర్పాటు చేసిన చపాతిని ఉపయోగించి తన మూతి తుడుచుకొని అవతల పడేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మళ్లీమళ్లీ ఈ వీడియోని చూస్తూ నవ్వుకుంటున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేసి అతి తక్కువ సమయంలోనే మిలియన్ సంఖ్యలో వ్యూస్, లక్షల్లో లైక్స్ సంపాదించుకుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.