...

Kriti Shetty: బుల్లెట్ సాంగ్ తో రెచ్చిపోయిన బేబమ్మ.. డాన్స్ వీడియో వైరల్!

Kriti Shetty: ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇలా మొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం అందుకోవడంతో తనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కృతి శెట్టి గత ఏడాది నాని శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు సినిమాలతో మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

ఈ క్రమంలోనే నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఈమె బిజీగా ఉన్నారు. అలాగే హీరో రామ్ సరసన ది వారియర్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా సందడి చేయనుంది. ఇకపోతే తాజాగా హీరో సూర్య సరసన కూడా నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ దక్కించుకున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది అటువంటి ది వారియర్ సినిమాలో బుల్లెట్ పాట విడుదలైన విషయం మనకు తెలిసిందే.

ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ విశేషమైన ఆదరణ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ పాటకు కృతి శెట్టి డాన్స్ వీడియో చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియోని కృతి శెట్టి సోషల్ మీడియా ఖాత ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్ ఆఫ్ చెక్కర్లు కొడుతుంది.పసుపు రంగు టాప్ దరించి ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈమె చేసిన ఈ డాన్స్ ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుందని చెప్పాలి.