Naga Chaitanya -Shobitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత జంట విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ జంట గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు సమంత ఇతరులతో రిలేషన్ ఉండటం వల్లే చైతన్యకు విడాకులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం అందరి ఫోకస్ చైతన్య పై ఉంది. నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన నటి శోభితతో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇలా వీరి గురించి గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.అయితే వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం గురించి నెటిజన్లకు తమదైన శైలిలో ఒక కట్టుకథను అల్లారు. నటి శోభితా నాగచైతన్య ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడిందని, అతని ద్వారా వీరిద్దరూ ఒక బర్త్ డే పార్టీలో కలుసుకుని పరిచయం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అనంతరం తరచూ కలవడం చాట్ చేసుకోవడం ద్వారా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొట్టాయి.
ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయమే ఇంతవరకు తీసుకు వచ్చిందని తెలుస్తోంది.ఈ విధంగా వీరి గురించి ఇప్పటి వరకూ ఇలాంటి డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈ విషయంపై నాగ చైతన్య కాని , నటి శోభిత కానీ ఏమాత్రం స్పందించలేదు.ఇక శోభితా తాజాగా మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడం నాగచైతన్య సైతం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు.మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.