Krishna -Vijayanirmala : తేనె మనసులు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటుడు కృష్ణ. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన తెలుగు తెరకు సరికొత్త చిత్రాలను పరిచయం చేశారు.హాలీవుడ్ రేంజ్ లో ఉన్నటువంటి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి చెందుతుందని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి మహేష్ బాబు రమేష్ మంజుల సంతానం కలరు. ఇకపోతే కృష్ణ ఎక్కువగా నటి విజయనిర్మలతో కలిసి సినిమాలు చేశారు.
ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి చివరికి ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. ఈ విధంగా విజయనిర్మలతో ప్రేమలో ఉన్న కృష్ణ ఒక గుడిలో విజయనిర్మలను వివాహం చేసుకున్నారు.ఇలా విజయనిర్మలను పెళ్లి చేసుకోవడం కృష్ణ గారి తల్లి కి ఏమాత్రం నచ్చడం లేదని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మెల్లిమెల్లిగా అమ్మకు సర్దిచెప్పడంతో వీరి వివాహాన్ని అంగీకరించిందని ఆదిశేషగిరి రావు వెల్లడించారు.
విజయనిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ కెరియర్ పరంగా ఒకరికొకరు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు.ఇకపోతే విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలలో కృష్ణ నటించి మంచి విజయాలు అందుకున్నారు.విజయనిర్మల దర్శకత్వంలో దాదాపు 40 సినిమాలకి పైగా తెరకెక్కి అప్పట్లో ఈమె గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఈ విధంగా కెరీర్ పరంగా ఎంతో చేదోడువాదోడుగా ఉన్నటువంటి విజయనిర్మల 2019 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.ఇక వీరిద్దరూ కలిసి తన సొంత బ్యానర్ పద్మాలయ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు విజయ్ నిర్మల స్థాపించిన విజయ్ కృష్ణ బ్యానర్లోనే నటించారని ఈ సందర్భంగా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు తెలిపారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World