Uttarpradesh: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతో సులభంగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు.ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాని ఉపయోగించుకుని కొందరు ఆర్థికపరంగా నెలకు లక్షల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు పేపర్లలో ఫన్నీ సన్నివేశాలను చూస్తూ నవ్వుకునే వారు.
ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ చూస్తూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మీమ్స్ క్రియేట్ చేసే వారు నెలకు లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన సత్యం చతుర్వేది వయస్సు సుమారు 21 సంవత్సరాలు ఉంటాయి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సత్యం ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. అయితే అంత స్థోమత లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు.
ఈ క్రమంలోనే 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మీమ్ పేజీని సృష్టించాడు. తరచుగా మీమ్‌లు తయారు చేసి పోస్ట్ చేసావారు. ప్రారంభంలో అతని స్నేహితులు ఎగతాళి చేసేవారు. ఏ పనీ చేయకుండా టైమ్ పాస్ చేస్తున్నారని ఎగతాళి చేశారు. అయితే క్రమక్రమంగా అతని ఫాలోవర్స్ పెరగడంతో ఇతను నెలకి రూ.1.50 లక్షలు సంపాదించడంతో అతని పేజీలో యాడ్‌లు పెట్టేందుకు పలు ఓటీటీ సంస్థలు, ప్రకటన సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇలా అతను సంపాదించడంతో ఊర్లో అందరూ అతని గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తన కొడుకుని నిలదీయడంతో అసలు విషయం బయట పెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా తన పై ప్రశంసలు కురిపించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World