మార్చి నెలలో 18 లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చి ఫిర్యాదులో పాటు ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసిన యంత్రాంగం సూచనల మేరకే 18.05 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే వాట్సాప్ నెలవారీ నివేదిక వెల్లడించింది.
ఫిబ్రవరి నెలలో కూడా 14.26 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఖాతాదారుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం మని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. కృత్రిమ మేధ సహా ఇతర సాంకేతికతలు, డేటా సైంటిస్టులు, నిపుణులపై పెట్టు బడులు పెడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయని… వాటి ప్రకారమే 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న ప్రతి సంస్థ ప్రతి నెల ఫిర్యాదుల నివేదికను వెల్లడించాలి. ఇందులో భాగంగానే వాట్సాప్ ప్రతి నెలా చర్యలు తీసుకుంటోంది. ఈ నెలలో కూడా చాలా ఖాతాలను వాట్సాప్ తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.