Two Men get Married : ఫుల్లుగా తాగి ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. చివరికి ఏమైందంటే?

Two Men get Married : ఫుల్లుగా తాగా.. తాగిన మైకంలో అబ్బాయిలిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు తాలి కట్టారు. ఆ తర్వాత కాపురానికి వచ్చానంటూ తాళి కట్టిన యువకుడి ఇంటి ముందుకు వచ్చి నానా హంగామా చేశాడు. అతని తల్లిదండ్రులు మందలించి.. ఇంటికెల్లమని చెప్పినా వినలేదు. చివరకు నన్ను అత్తారింటి వాళ్లు రానివ్వట్లేదంటూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాళి కట్టిన వాడు లక్ష రూపాయలు ఇస్తే తప్ప కేసు వాపసు తీసుకోనంటూ మొండికేశాడు. ఈ వింత ఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ లో మంగళ వారం వెలుగుచూసింది.

పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సంగారెడ్డి జిల్లా జోగీపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు కాగా, రెండో వ్యక్తి చిలప్‌చెడ్‌ మండలం చండూర్‌కి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవరు. కొల్చారం మండలం దుంపల కుంటలోని ఓ కల్లు దుకాణంలో వీరికి స్నేహం ఏర్పడింది. ఈ నెల 1న తాగిన మైకంలో ఉన్న చండూర్‌ యువకుడితో తాళి కట్టించుకునే వరకూ పోయింది.

మొత్తంగా పోలీసులు, గ్రామపెద్దలు ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి చర్చించారు. చివరకు చండూర్‌ యువకుడి కుటుంబీకులతో రూ.10వేలు ఇప్పించడంతో కథ సుఖాంతమైంది. జోగిపేట యువకుడు ఫిర్యాదు వాపసు తీసుకున్నట్లు చిలప్‌చెడ్‌ ఠాణా ఎస్‌ఐ మహ్మద్‌గౌస్‌ తెలిపారు.

Advertisement

Read Also : Thamannah : నిహారిక తప్పేం లేదంటూ.. పబ్ ఘటనపై తమన్నా సింహాద్రి స్పందన!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel