Horoscope 2022 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని కారణంగా బాధ పడేవాలికి ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకమైంది. అయితే రెండున్నరేళ్లుగా శనీశ్వరుడితో ఇబ్బంది పడే ఈ మూడు రాశుల వారికి శని దేవుడిని నుంచి ఈ నెలలో విముక్తి కల్గబోతోంది. అయితే ఈ మూడు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం… శని గ్రహం మిథునం, తుల రాశి వారిపై ఉంది. అలాగే ధనస్సు, మకర, కుంభ రాశుల వారికి శని అర్ధశతకం కొనసాగుతోంది. 29 ఏప్రిల్ 2022న శని దేవుడు మకర రాశి నుంచి కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపించినప్పటికీ… ఈ మూడు రాశుల వారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు.
ముందుగా మిథున రాశి… శనీశ్వరుడు కుంభ రాశిలోకి వచ్చిన వెంటనే మిథున రాశి వాళ్లకి శనీశ్వరుడి నుంచి విముక్తి కల్గుతుంది. ధైయా ప్రభావం ముగిసిన వెంటనే ఈ రాశి వారి సమస్యలు తగ్గుతూ పోతాయి. అలాగే రెండోది తులా రాశి… ఏప్రిల్ 29వ తేదీన శనిగ్రహ సంచారం తర్వాతం ధైయా ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి తులా రాశి వారికి తిరుగు లేదు. వారు ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ఇక నుండి మీరు చేయబోయే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అలాగో మూడోది ధనస్సు రాశి… ప్రస్తుతం ధనస్సు రాశిలో శని అర్ధ శతకం కొనసాగుతోంది. కానీ ఏప్రిల్ 29న శని గ్రహం రాశి మారిన వెంటనే ఈ రాశి వారికి శని నుంచి విముక్తి కల్గుతుంది. ఫలితంగా ఈ రాశి వారి జీవితంలో సంతోషం వస్తుంది. ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ, వ్యాపారల్లో ధన లాభం ఉంటుంది.
Read Also : Hanuman jayanthi 2022: ఈరోజు పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే.. ఈ 5 కోరికలు నెరవేరుతాయి!