Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Whisky Bottle: వామ్మో….భారీ ఎత్తుండే విస్కీ బాటిల్… ఆ పని కోసం వేలంలో విస్కీ బాటిల్?

Whisky Bottle: సాధారణంగా విస్కీ బాటిల్ ఎంత ఉంటుంది అంటే చాలా మంది మన అరచేతి పొడవు ఉంటుంది అని సమాధానం చెబుతారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఎత్తు ఉండే విస్కీ బాటిల్ గురించి విన్నారా. విస్కీ బాటిల్ ఏంటి? మనిషి ఎత్తు ఉండటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం అండి బాబు ఏకంగా 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే విస్కీ బాటిల్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం ... Read more

By Ramesh Babu

Published on: May 2, 2022 10:00 PM

Updated on: May 2, 2022 6:42 PM

---Advertisement---

Whisky Bottle: సాధారణంగా విస్కీ బాటిల్ ఎంత ఉంటుంది అంటే చాలా మంది మన అరచేతి పొడవు ఉంటుంది అని సమాధానం చెబుతారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఎత్తు ఉండే విస్కీ బాటిల్ గురించి విన్నారా. విస్కీ బాటిల్ ఏంటి? మనిషి ఎత్తు ఉండటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం అండి బాబు ఏకంగా 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే విస్కీ బాటిల్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్‌ హౌజ్‌.. లైఆన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ ఈ వేలంపాటను మే 25వ తేదీన ఈ ఎత్తయిన భారీ విస్కీ బాటిల్ వేలం వేయనున్నారు. ఇప్పటివరకు విస్కీ బాటిల్స్ వేలంలో 1.9 మిలియన్ డాలర్లు మన భారత కరెన్సీ ప్రకారం 14 కోట్లు రూపాయలకు అమ్ముడుపోయింది.ఈ క్రమంలోనే ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ది ఇంట్రెపిడ్‌ విస్కీ బాటిల్ కేవలం రికార్డుల కోసమే నిర్వాహకులు దీనిని భారీ మొత్తంలో తయారు చేశారు.

ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్ బాటిల్స్ కలిస్తే ఎంత అయితే ఉంటుందో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్ అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే గత ఏడాదే ఈ బాటిల్ గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోగా, తాజాగా ఈ బాటిల్ వేలం వేయాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలోనే మే 25వ తేదీ వేసే వేలంలో భాగంగా ఈ బాటిల్ ప్రారంభ ధరనే 1.3 మిలియన్‌ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఇలా ఈ బాటిల్ వేలం వేయగా వచ్చిన డబ్బులో 25% మేరీ క్యూరీ చారిటీ ట్రస్ట్ కోసం విరాళంగా ఇవ్వాలని భావించినట్లు తెలిపారు.ఇలా ఒక మంచి పని చేయడం కోసమే భారీ విస్కీ బాటిల్ ను వేలం వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!