Ziziphus Oenoplia : పరికి చెట్టు..(Ziziphus Oenoplia) అదేనండీ.. పరికి కంప చెట్టు.. పరికి కాయలు, పరికి పండ్లు.. (Pariki Chettu) అని చిన్నప్పుడు వినే ఉంటారు. ఇంతకీ ఈ చెట్లను చూస్తే ఏదో పిచ్చి కంప చెట్లలా కనిపిస్తుంది కానీ, ఇందులోనే ఔషధ గుణాల గురించి తెలిస్తే.. అసలే వదిలిపెట్టరు.. వెంటనే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటారు. ఈ చెట్టుంతా ఔషధాల గని.. ఎలాంటి రోగమైన తోకమూడవాల్సిందే.. సాధారణంగా గ్రామాల్లోని పోలాల్లో ఎక్కువగా కనిపించే ఈ కంప చెట్టు చూడటానికి అచ్చం రేగి చెట్టులానే ఉంటుంది. చాలా చిన్నదిగా కనిపిస్తుంది. గ్రామాల్లో పరిక కాయల చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ చెట్లు పొలాల్లో బాగా కనిపిస్తాయి.
పరిక చెట్టు లేదా దీనికి వృక్ష శాస్త్రీయ నామం ((Ziziphus Oenoplia)గా పిలుస్తారు. ఈ పరిక చెట్టు ముళ్లతో నిండి ఉంటుంది, ఈ ముళ్ళు చాలా గట్టిగా పదనుగా ఉంటాయి. ఈ చెట్టు 5 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. ఇతర చెట్ల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పరిక చెట్ల కాయలు చిన్నగా బటానీ గింజల్లా ఉంటాయి. పచ్చి కాయలు ఆకుపచ్చగా, దోర కాయలు ఎరుపు రంగులో, బాగా పండినవి నలుపు రంగులో కనిపిస్తాయి.
ఈ కాయలను విత్తనాలతో కలిపి నమిలి తింటారు. బాగా పండిన కాయలు పుల్లగా, తీయగా రుచికరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయలను తింటే గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. చిగుళ్ల సమస్యలను చిటికెలో మాయమైపోతాయి. దంతాలకు రక్షణ ఇస్తాయి. ఈ చెట్టు కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Read Also : Krishna Tulsi Plant : ‘కృష్ణతులసి’ వేరుకు ఎంత పవర్ ఉందో తెలుసా.. జంటలు రాత్రుళ్లు అలసిపోవాల్సిందే..!
ఈ పండ్లను నిత్యం తింటుంటే తలనొప్పి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. జ్ఞాపకశక్తి కూడా అద్భుతంగా పెరుగుతుందట.. ఇక నరాల సమస్యలను కూడా నయం చేస్తుంది. పుండ్లు వెంటనే మానేలా చేయగల ఔషధ గుణాలు ఈ పరిక పండ్లలో ఉన్నాయి. ఈ పండ్లను ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ కూడా దరిచేరదట.. ఒక్క పరికి కాయలే కాదండోయ్.. పరిక కంప చెట్టు ఆకులు, దాని బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ చెట్టు ఆకులతో బెరడుతో ఏయే ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం..
ఎన్ని ఉపయోగాలో తెలుసా? ఇవిగో..
మీరు చేయాల్సిందిల్లా.. పరికి కాయల చెట్టును సేకరించండి. ఆ తర్వాత ఆ చెట్టు ఆకులను బాగా దంచాలి. ఆ తర్వాత ఆ ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు తగిలిన ప్రాంతంలో పెట్టి కట్టు కట్టాలి. తద్వారా వెంటనే పుండ్లు, గాయాలు ఏమైనా సరే వెంటనే తగ్గిపోతాయి. గజ్జి తామరతో పాటు దురద సమస్యతో బాధపడేవారు కూడా ఈ ఆకులను ముద్దగా నూరుకుని ఆ రసాన్ని రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. ఈ ఆకుల రసాన్ని ఒక గ్లాసులో వేసి బాగా మరిగించుకోవాలి. కషాయాన్ని మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఈ ఆకుల కషాయాన్ని నోట్లో పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది. నోటి దుర్వాసన మాత్రమే కాదు.. చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అన్ని రకాల దంత సమస్యలకు పరిక ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ చెట్టు కాండం బెరడుతో గొంతు నొప్పితో బాధపడేవారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ చెట్టు బెరడుతో శరీరానికి టాన్ చేయడానికి కూడా వినియోగించవచ్చు. పరికి కాయల చెట్టు బెరడును ఎండబెట్టి బాగా దంచి పొడి చేసుకోవాలి. చెట్టు బెరడును పొడి స్క్రబ్‌లా వినియోగించుకోవచ్చు. ఈ చెట్టు బెరడును ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత కషాయంలో తయారు చేసుకుని తాగితే అనేక అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి అంతే.. అంత గొప్ప శక్తి ఈ పరికి చెట్టులో దాగి ఉంది.
Read Also : Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందంటే?